Satavarsha Sekharam

This book was published in the year 2013 and was released on the occasion of Sankara Jayanthi.

మానవ జీవితంలో శాంతి సామరస్యాలను, ప్రాచీన వేదవిహిత సంప్రదాయాలమీద భక్తి, అనురక్తులను, ఆధ్యాత్మిక జిజ్ఞాసను లక్షలాది భక్తులలో ప్రజ్వలింపచేసిన మహనీయులు కంచికామకోటి 
పీఠాధీశులు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి.

ఇటువంటి ఆచార్య శ్రేష్టుల ఔన్నత్యాన్ని వివరించటానికి ఎన్ని గ్రంథాలయినా సరిపోవు.

అయినా అట్టి గ్రంథపరంపర నిరంతరాయంగా వెలువడుతూనే ఉన్నది.

శ్రీచరణుల జీవితం, ఉపదేశాలు, సందేశాలు, సన్నివేశాలు సంకలనం చేసి, కొండ అద్దమందు చూపే ప్రయత్నమే శతవర్ష శేఖరం.

ఇందులో నీలంరాజు వెంకటశేషయ్య, చల్లా విశ్వనాథ శాస్త్రి, విశాఖ, ఎ.ఎస్.రామన్, తాడేపల్లి రాఘవనారాయ శాస్త్రి వంటి ప్రముఖులు ౩౦ యేళ్ళ క్రితం రాసిన వ్యాసాలు ఎంతో శ్రమపడి సేకరించి 
ప్రచురించాం.

ఈ వ్యాసాలలో కేవలం ఆధ్యాత్మిక విషయాలే గాక, హిందూ వివాహం, మనకు చరిత్ర లేదా?, ఇందిరాగాంధీ గారు ఆదిశంకరులపై పోష్టల్ స్టాంప్ వెయ్యాలనుకోవటం, విశ్వనాథ సత్యనారాయణగారు స్వామిని దర్శిచినప్పుడు జరిగిన విచిత్ర సంఘటన వంటి ఆసక్తికర కథనాలు, స్వామి కి జరిగిన కనకాభిషేక విశేషాలు, స్వామివారి మహాప్రస్థానం... అనేకానేక భక్తుల అనుభవాలు, ఇలా.... ఎన్నో విషయాలు గుదిగుచ్చిన మందారమాల. తనను తాను సంస్కరించుకొని , మార్గదర్శనం పొందటానికి ఇలాంటి పుస్తకాల పఠనం ఉపకరిస్తుంది.

Write a review

Please login or register to review
  • Satavarsha Sekharam
  • Product Code: 03
  • Availability: Out Of Stock
  • 0.00


Tags: satavarsha sekharam, paramacharya, ebook, free, challapalli, challapalli venkata ratna prasad