Chandra Sekhara Vacho Vibhuti

This book was published in the year 2014 and was released on the occasion of 21st Aaradhana of Mahaswami.

కంచి స్వామి వారు సుమారు 35 నెలలపాటు 1966జూన్ - 1969 మే, మధ్యకాలంలో ఆంధ్రదేశంలో విస్త్రుతంగా పర్యటించారు.

ఈ విధంగా స్వామి ’పాద’ స్పర్శ తోను, కాలుమోపిన ప్రతి చోటా ప్రవచనాలు చేసి ’పద’ స్పర్శతోను పునీతమైనది ఆంధ్రదేశం.

ఈ విజయయాత్ర విశేషాలను, వారి ప్రసంగాలను ఆనాటి పత్రికలు ప్రకటించాయి.

ఆనాటి పత్రికలలో తప్ప ఇంకెక్కడా ప్రచురితం కాని కొన్ని ప్రసంగ పాఠాలను సేకరించి ఏర్చికూర్చినది ఈ గ్రంథం.

శివలింగావిర్భావం, విశ్వవ్యాప్తమైన హిందూమతం, కుటుంబ నియంత్రణ, నేటి విద్యావిధానం లాంటి సామాజిక విషయాలు, భద్రాద్రివాసుని భద్ర గజం, వరదరామదాసు ఇచ్చిన ఆజ్ఞాపత్రం, గర్భాలయ శిల్పసౌందర్యం గురించి శ్రీచరణుల పరిశీలన, ప్రసిద్ధ పాశ్చాత్య తాత్త్వికుడు పాల్ బ్రంటన్ పరిచయం వంటి అంశాలతో వెలువడిన పుస్తకం ఇది.

అప్పటి మా ఆంధ్రయాత్ర బహు విస్తారమైనది. అనేక విశిష్టమైన కార్యక్రమాలు స్వామి నేతృత్వమున జరిగినవి.

వాటిలోకి తొంగి చూసే ఈ ప్రయత్నం భావి తరాలకు ఎంతో ఉపయోగికారి కాగలదు- అని జయేంద్రసరస్వతుల ఆశీర్వాదములను; మహాస్వామి చరిత్ర ఒకటేకాదు మహోన్నతులైన కామ్మకోటి పూర్వాచార్యుల ఆంధ్ర పర్యటన విషయము వెలికి రావలసి ఉన్నది.

ఇట్టి పరిశోధన దిశలో మొదటి అడుగు చంద్రశేఖరవచో విభూతి; అని కంచికామాక్షి ఆలయం శ్రీకార్యం, ప్రఖ్యాత పండితులు, రచయిత శ్రీ చల్లా విశ్వనాథశాస్త్రి గారి పరిశీలనాత్మక ప్రశంసలను అందుకొన్నది ఈ గ్రంథం.

Write a review

Please login or register to review
  • Chandra Sekhara Vacho Vibhuti
  • Product Code: 04
  • Availability: Out Of Stock
  • 0.00


Tags: challapalli, challapalli venkata ratna prasad, paramacharya books, chandra sekhara vacho vibhuti, ebook, download, save 20%